వాలెంటర్ వేధిస్తున్నాడని మహిళా ఆరోపణ.

0
108

అనపర్తి ( పున్నమి విలేకరి) :- అనపర్తి మండలంలోని కొప్పవరం గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న వ్యక్తి వేధిస్తున్నాడని వివాహిత మహిళ ఆరోపించింది.
ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాల ప్రకారం తన భర్త వ్యాపారం నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లడంతో మండలం లోని కొప్ప వరం గ్రామం లో తన తల్లిదండ్రులు ఇంటివద్ద ఉంటున్నానని, అయితే తమ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు గొలుగూరి దుర్గారెడ్డి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడని, అతను నన్ను అక్క అని పిలుస్తూ మా ఇంట్లో సన్నిహితంగా ఉండేవాడిని, క్రమేపీ అతని మనసులో చెడు ఆలోచనలు కలిగి వరసా వాయ లేకుండా నన్ను లొంగ దీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడని, నేను వ్యతిరేకించడంతో నాపై కక్ష కట్టి ఫేస్ బుక్ లో నా పేరున ఫేక్ ఐడిని సృష్టించి నావి, నా కుటుంబముతో ఉన్న అనేక ఫోటోలను అప్లోడ్ చేసి వేధిస్తున్నాడని, ఈ వ్యవహారంపై నేను అనపర్తి పోలీసులను ఆశ్రయించడంతో కొప్పవరం గ్రామ పెద్దలు రాజీ కుదుర్చారని, ఫేస్ బుక్ లో ఫోటోలు డిలీట్ చేయకపోతే అరెస్ట్ చేస్తానని అతన్ని పోలీసులు కూడా హెచ్చరించారని, ఈ వ్యవహారము జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతను ఫేస్ బుక్ లో ఫోటోలు డిలీట్ చేయలేదని, ఎందుకు డిలీట్ చేయలేదని అతని నిలదీస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆమెను తల్లిదండ్రుల ఇంటికి పంపించడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సదరు వాలంటరీ ఇంటివద్ద ధర్నాకు దిగింది. పోలీసులు గ్రామ పెద్దలు నాకు న్యాయం చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని కన్నీటితో విలపిస్తుంది. వాలంటీరుగా పని చేస్తూ ఉన్నతమైన స్థానంలో ఉంది ఇటువంటి అసభ్యకరమైన వ్యవహారం చేయడం మంచిది కాదని ప్రజలు అనుకుంటున్నా రు.