संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जयशंकर भूपालपल्ली

వనమహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • భూపాలపల్లి, ఆగస్టు 25( పున్నమి ప్రతినిధి): వనమహోత్సవం–2026లో జిల్లాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి వారం నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
  • సోమవారం సచివాలయం నుంచి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

భూపాలపల్లి, ఆగస్టు 25( పున్నమి ప్రతినిధి): వనమహోత్సవం–2026లో జిల్లాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి వారం నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయం నుంచి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని, అర్బన్ ఫారెస్ట్ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, దేవాలయాల ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు.

జిల్లాకు 25.26 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 19.37 లక్షల మొక్కలు నాటినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ బాలకృష్ణ, ఎఫ్‌డీఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *