24.04.2020, నెల్లూరు,(పున్నమి ప్రతినిధి – సి.యస్.రావు ) *లాక్ డౌన్ లో ఆకలికి అలమటిస్తూ వున్న వారి పొట్ట నింపుతున్న మనసున్న మహానుభావులు* పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా తిండి తిప్పలకు అల్లాడుతున్న బిచ్చగాళ్లను, వలస కూలీలును , నేషనల్ హైవే పై పలు రాష్ట్రాలకు జిల్లాలకు వెళ్తున్న కూలీలు ఇతరులకు 40 రోజులుగా వంద మందికి టిఫిన్ , భోజనం మంచినీరు అందజేస్తూ ,వారి ఆర్థిక స్థితి గురించి కూడా పట్టించుకోకుండా, మానవత్వంతో ఆలోచించి సేవ చేస్తూ సేవ చేసిన విషయం కూడా ఫోటోలు వీడియోలు తీయకుండా మాధ్యమాల్లో ప్రచారం చేసుకోకుండా సేవ చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకర్ రావు గుర్తించి , ఆ రెండు కుటుంబాల వారు ఆటోలో ఫుడ్ తీసుకువచ్చి అన్నం పెడుతూ ఆకలి తీర్చుతున్న , తోటి వ్యక్తుల ఆకలి బాధను అర్థం చేసుకుంటూ సేవ చేస్తున్న వేణు గోపాల్ వర్మ -శేష శైలజ, సునీల్ – లక్ష్మీ గార్లను ఘనంగా అభినందించారు. ఈ రోజు కూడా నేషనల్ హైవే లో వెళ్లే వలస కూలీలకు ,అయ్యప్ప గుడి దగ్గర ,ఆత్మకూరు బస్టాండ్ పరిధిలోని సాయి బాబా గుడి దగ్గర ఉన్నవారికి ఉదయం 9 గంటలకు టిఫిన్ అంద చేయడం జరిగింది. కరోనా కోవిద్ 19 కారణంగా పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడుతున్న వారి ఆకలి తీరుస్తూ ప్రచార ఆర్భాటాలు దూరంగా ఉంటూ సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించే దానిలో భాగంగా వీరిని అభినందించడం జరిగిందని ఆయన అన్నారు.