Saturday, 26 September 2026
  • Home  
  • రూ.40 లక్షలతో శ్రీ రాములస్వామి ఆలయ నిర్మాణం
- తిరుపతి

రూ.40 లక్షలతో శ్రీ రాములస్వామి ఆలయ నిర్మాణం

పుల్లంపేట: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని ఎగవరెడ్డి అరుంధతివాడలో నూతనంగా నిర్మించనున్న శ్రీ రాములస్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.