శ్రీకాకుళం : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి సోమవారం సందర్శించారు. ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, రిమ్స్ క్వారంటైన్ లో ఉంటున్న వారిని పరామర్శించి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరిని త్వరగా హోం క్వారంటైన్ కు పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.