संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన కాకినాడ జిల్లా కె9 బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన కాకినాడ జిల్లా కె9 బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ.

खबर की मुख्य बातें

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్): విజయవాడ–మంగళగిరి 6వ బెటాలియన్‌లోని ఐఎస్‌డబ్ల్యూ డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో 23వ బ్యాచ్‌కు చెందిన కె9 బృందాలు 10 నెలల కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, రాష్ట్ర స్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాలు సాధించడం కాకినాడ…
  • 10 నెలల శిక్షణలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో డాగ్ లియో – హ్యాండ్లర్ ఎన్.డి.
  • దినేష్ నాయుడు, స్పేర్ హ్యాండ్లర్ ఎం.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్):
విజయవాడ–మంగళగిరి 6వ బెటాలియన్‌లోని ఐఎస్‌డబ్ల్యూ డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో 23వ బ్యాచ్‌కు చెందిన కె9 బృందాలు 10 నెలల కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, రాష్ట్ర స్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాలు సాధించడం కాకినాడ జిల్లా పోలీసులకు గర్వకారణంగా నిలిచింది.
10 నెలల శిక్షణలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షల్లో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో డాగ్ లియో – హ్యాండ్లర్ ఎన్.డి. దినేష్ నాయుడు, స్పేర్ హ్యాండ్లర్ ఎం. గంగాధర్ రావు ప్రథమ స్థానాన్ని సాధించగా, మాదక ద్రవ్యాల గుర్తింపు విభాగంలో డాగ్ ర్యాండీ – హ్యాండ్లర్ రాజేష్, స్పేర్ హ్యాండ్లర్ ఎం. శివ శంకర్ ప్రథమ స్థానాన్ని సాధించారు.
కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని కాకినాడ జిల్లాకు తిరిగి వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ K9 బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా K9 బృందం సాధించిన విజయాన్ని అభినందిస్తూ, వారి కృషి, అంకితభావం, క్రమశిక్షణతో పాటు శిక్షణలో కనబరిచిన ప్రతిభను ప్రశంసించారు. డాగ్ లియో – హ్యాండ్లర్ ఎన్.డి. దినేష్ నాయుడు మరియు డాగ్ ర్యాండీ – హ్యాండ్లర్ రాజేష్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించడం కాకినాడ జిల్లా పోలీసులకు గర్వకారణమని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి, అంకితభావంతో విధుల్లో రాణించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస రావు,ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరి రావు,ఎమ్.టి ఆర్‌ఐ నరసింహమూర్తి ,పోలీసు సిబ్బంది పాల్గొని కె-9 బృందాన్ని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *