संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

రాజురలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రాజురలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర
Oplus_16908288

खबर की मुख्य बातें

  • Uploaded Video:

లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో కురుమే సంఘం, ” శక్తి యూత్ “ఆధ్వర్యంలో దుర్గామాత ఆగమన వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ఆగమనాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. గ్రామానికి దుర్గామాత చేరుకోవడంతో భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో దుర్గామాతకు స్వాగతం పలికారు. యువకులు, గ్రామ పెద్దలు, చిన్నారులు ఈ ఆగమన వేడుకల్లో పాల్గొని భక్తిని చాటుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, దుర్గామాత ఆగమన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ జడ్ల రవి, వైస్ ప్రెసిడెంట్ బోడుకల రాకేష్, క్యాషియర్ ఓరికే గంగాధర్‌తో పాటు యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *