Monday, 27 July 2026
  • Home  
  • రచయిత్రుల–కవయిత్రుల విభాగానికి డాక్టర్ ప్రభల జానకి, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి ఎన్నిక
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రచయిత్రుల–కవయిత్రుల విభాగానికి డాక్టర్ ప్రభల జానకి, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి ఎన్నిక

కోనసీమ రచయితల సంఘం రచయిత్రుల–కవయిత్రుల ప్రత్యేక విభాగానికి గౌరవ అధ్యక్షురాలిగా ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు డాక్టర్ ప్రభల జానకి, అధ్యక్షురాలిగా ప్రముఖ రచయిత్రి పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో మరో 20 మంది రచయిత్రులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు బి.వి.వి. సత్యనారాయణ తెలిపారు. మహిళల సృజనాత్మకతను వెలికితీసి తెలుగు సాహిత్యానికి మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవస్థాపక కార్యదర్శి నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ కవిత్వం, కథలు, వ్యాసరచనలో శిక్షణ, సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, రచనా శిబిరాల ద్వారా మహిళా రచయిత్రులను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడు అరిగెల బలరామమూర్తి నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.