యోగ డే సందర్భంగా ఆరోగ్య మార్గాన్ని శిరసావహించిన రజని జంపాని
📍 బెంగళూరు, జూన్ 21 (పున్నమి తెలుగు డైలీ)
రజని జంపాని, బెంగళూరుకు చెందిన హోమ్‌మేకర్, అంతర్జాతీయ యోగ డే సందర్భంగా ఆరోగ్య మార్గాన్ని పాటిస్తూ యోగ సాధనలో పాల్గొన్నారు. ఇంటి పనులతో నిత్యం బిజీగా ఉండే ఆమె, ఈ రోజుని ప్రత్యేకంగా గుర్తుంచుకుంటూ “ఆరోగ్యమే అసలైన సంపద” అని సందేశం ఇచ్చారు.
“శరీరానికి విశ్రాంతి, మనసుకు శాంతి ఇవ్వగలిగేది యోగ మాత్రమే,” అని ఆమె అభిప్రాయపడ్డారు. యోగ సాధన ద్వారా తాను పొందిన శాంతిని ఇతర మహిళలతో పంచుకోవాలనే తపనతో, ఆమె యోగ డే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.
📞 ఫోన్: 7207443899