యోగా సిందూర్: ఆరోగ్యానికి, దేశ భద్రతకు సమిష్టి శక్తి!

0
80

 

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా “యోగా సిందూర్” పేరిట జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా చాలెంజ్ దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. “For Individual Health & National Strength” అనే నినాదంతో యోగా నారాయణ్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆరోగ్య సూత్రాలనే కాదు, జాతీయతా స్పూర్తినీ ప్రజల్లో రగిలిస్తోంది.

ప్రతి రోజు ఉదయం 5:00 నుంచి 6:30 వరకు జరిగే యోగా సెషన్లు వేలాది మంది సాధకులను ఆకర్షిస్తున్నాయి. ఈ చాలెంజ్ ఫినాలే జూన్ 22న ఉదయం 9:00 గంటలకు YouTube Live ద్వారా జరగనుంది. లక్షమంది యోగా సాధకులను ఐక్యంగా చేర్చాలన్నది ప్రధాన లక్ష్యం. “₹1+” విరాళం ద్వారా పాల్గొనవచ్చు – ఈ విరాళం ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఉపయోగించబడుతుంది.

జూన్ 18 – డే 18 హైలైట్:

ఈ రోజు ముఖ్య అతిథిగా ఎం. సురేష్ కుమార్ (రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ – ఎస్‌బీఐ లైఫ్, ఇంటర్నేషనల్ కెరీర్ కోచ్) పాల్గొని యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ – “యోగా అనేది శారీరక మెరుగుదలకు కాదు, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థిరతకూ మార్గం” అని చెప్పారు.

ఈ చైతన్య కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తున్న డా. యోగా నారాయణ్ గారు – అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా, లా ఆఫ్ అట్రాక్షన్ నిపుణిగా, లైఫ్ కోచ్‌గా ప్రసిద్ధి గాంచారు.

నమోదు కోసం: www.mysuccesslife.in

సంప్రదించండి: 7799500019 / 7799400019

నినాదం:

🇮🇳 “Yoga for Me – I Am for the Nation!” 🇮🇳

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here