- *దగదర్తి
మండలంలోని సున్నపుబట్టి జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీప్రాంతంలో చంద్రారెడ్డి అనే యువకుడు సోమవారం దారణ హత్యకు గురయ్యాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు మృతుడు బుచ్చి మండలంలోని పురందరపురం గ్రామానికి చెందిన చంద్రారెడ్డి (23)గా గుర్తించారు. అయితే మృతుడు చంద్రారెడ్డి మెడికల్ ఏజెన్సీలో రిప్రజింటర్ గా పనిచేస్తుంటాడని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి రాత్రి ఇంటికి పోవకపోవటంతో కుటుంబ సభ్యులు కంగారు పడి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఆప్ వచ్చింది .దీంతో కుటుంబసభ్యులు ఉదయం నుంచి చుట్టుపక్కల వారిని విచారించగా సున్నపుబట్టి అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ ఉందని తెలుసుకొని సంఘటన ప్రాంతానికి అక్కడ ఉన్న బైక్ ను చూసి తమ వాడేనని గుర్తించి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మెఖం పై గాటులు పక్కన కండోమ్ ప్యాకెట్లు ఒక కత్తి పడి ఉండటాన్ని గమనించారు. అయితే మృతిడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు అలానే ఉన్నాయి.దీంతో పోలీసులు ఏదైనా అక్రమ సంబందం ఉందేమో అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.