గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గిద్దలూరు మండలం పొడలకొండపల్లె గ్రామానికి చెందిన ఆగోలు శివనాగార్జున యాదవ్ అనే యువకుడు మేము ఉన్నాము సేవసంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే ఓ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో O+ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో మేమున్నాం సేవాసమితి ద్వార విషయం తెలుసుకున్న ఆగోలు శివనాగార్జున యాదవ్ రక్త దానం చేశారు. ఆపత్కాలంలో, స్పందించినందుకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేమున్నాం సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.