ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు… ఎస్. ఐ సూర్య ప్రకాష్ రెడ్డి

    0
    197

    25-05-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా మనుబోలు మండల ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు మనుబోలు ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ విపత్కర కరోనా సమయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ.. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన తెలిపారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని తెలిపారు.భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు మరియు శానిటైజర్ ఉపయోగించుకుంటూ పవిత్రమైన రంజాన్ పండుగను ఆరోగ్యవంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఎస్. ఐ సూర్యప్రకాష్ రెడ్డి కోరినారు .

    0
    0