संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై అవగాహన!

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై అవగాహన!

खबर की मुख्य बातें

  • కొలిక్కి వచ్చిన కూటమి పొత్తులు!
  • ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
  • రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీకి సంబంధించి కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

కొలిక్కి వచ్చిన కూటమి పొత్తులు!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీకి సంబంధించి కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, బీజేపీకి ఒక కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 12 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *