ముత్తుకూరు ప్రాంతంలో భారీ వర్షం, వాహనదారులకు తీవ్ర అసౌకర్యం
ముత్తుకూరు, పన్నమి ప్రతినిధి – సుకుమార్:
- నేడు (బుధవారం) ఉదయం 7:30 గంటల నుంచి ముత్తుకూరు ప్రాంతాన్ని భారీ వర్షం చుట్టుముట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది.
ఈ ఆకస్మిక వర్షం కారణంగా రహదారి మార్గాల్లో నీటి ప్రవాహం పెరిగిపోయింది, దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన వీధుల్లో జలమయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రజలు అత్యవసరంగా తప్ప అయితే ప్రయాణాల వద్దకు పరిమితం కావాలని, వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.