ముగిసిన శ్రీనిధి NSS “ఆరంభ్ 2025” మెగా వైద్య శిబిరం

0
45

ముగిసిన శ్రీనిధి NSS “ఆరంభ్ 2025” మెగా వైద్య శిబిరం
పున్నమి -రిపోర్టర్ పరశురాం: ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ

శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో NSS ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహించిన “ఆరంభ్ 2025” మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరంలో శరీర పరిశీలనలు, కళ్ల పరీక్షలు, దంత వైద్య సేవలు మొదలైన వైద్య సేవలు ఉచితంగా అందించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా JNTUH NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. శోభ రాణి గారు హాజరై, శిబిరంలో జరుగుతున్న సేవలను మెచ్చుకున్నారు.

కళాశాల Principal డా. టి.చె. శివ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సహించారు. Management నుంచి కూడా విశేష సహకారం లభించింది.

NSS Programme Officer డా. ప్రీతి జీవన్ గారు, డా. పురుషోత్తం, డా. జఫ్ఫార్, డా. దివ్య మరియు అనేక మంది అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు, నాన్-టీచింగ్ సిబ్బంది ఈ శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా కళాశాల విద్యార్థుల సేవా దృక్పథం మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు.

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here