संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

ముక్కావారిపల్లిలో ఘనంగా శ్రీ మాతమ్మ తల్లి జాతర

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ముక్కావారిపల్లిలో ఘనంగా శ్రీ మాతమ్మ తల్లి జాతర

खबर की मुख्य बातें

  • ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి అరుంధతివాడలో శ్రీ మాతమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
  • జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
  • పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మాతమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి అరుంధతివాడలో శ్రీ మాతమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మాతమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జాతర మహోత్సవంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఆమెను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. జాతర సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *