మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి –  నాయకులు శ్రీమతి మెహరున్నిసా,శ్రీమతి పుష్ప,శ్రీమతి రజిని

0
158

 

విశాఖపట్నం, 21 మార్చి: కోవిడ్ మహమ్మారి తరువాత ఏర్పడిన దురదృష్టకర పరిస్థితులు వల్ల ఆదాయం కోల్పోయి అధిక వడ్డీలకు అప్పులు చేసి , అప్పులు తీర్చే మార్గం లేక అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బడుగు బలహీన దళిత వలస కుటుంబాల నుండి మహిళలు, వారి పిల్లలు అక్రమ రవాణాకు గురికాకుండా నిరోధించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వ సమగ్ర అక్రమ రవాణా చట్టం రూపొందించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందే విధంగా చూడాలి అని అక్రమ రవాణా బాధితులతో ఏర్పాటైన రాష్ట్ర సమాఖ్య విముక్తి డిమాండ్ చేస్తుంది.
ఆదివారం ఉదయం విశాఖ ప్రెస్ క్లబ్ లో విముక్తి రాష్ట్ర నాయకులు శ్రీమతి మెహరున్నిసా,శ్రీమతి పుష్ప,శ్రీమతి రజిని విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్ పాల్గొన్నారు .

ఈ సమావేశంలో విముక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నిసా మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 250 మంది అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్లతో 2018 లో “విముక్తి ” అనే సమాఖ్య ప్రారంబించారు అన్నారు . కోవిడ్ అనంతరం రాష్ట్రంలో అక్రమ రవాణా పెరిిగిందని అంటూ, కోవిడ్ అనంతరం ఉపాధి లేకపోవటంతో ఎన్నో కుటుంబాలు తమ పిల్లలని బాండెడ్ కూలీలుగా , ఇండ్లలో చాకిరి కోసం తరలి వెళ్తున్నారని ఫలితంగా వీరిపై నియంత్రణ నిఘా లేనందున వీరు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు..శ్రీమతి రజిని విముక్తి కో కన్వీనర్ మాట్లాడుతూ మనదేశంలో 2019 లో 2080 మంది అక్రమ రవాణా కు గురైనారని , అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 356 మంది(15.19%) అక్రమ రవాణా కు గురైనారు. ఈ 350 మంది లో 245 మంది వ్యభిచారం కోసం , 14 మంది బాలికలు బలవంతపు పెళ్లి కోసం , 31 మంది ఇండ్లలో పని, ఫ్యాక్టరీలలో పనికోసం మరో 60 మంది వివిధ ఇతర కారణాలు కోసం అక్రమ రవాణా కు గురి కావడం జరిగిందన్నారు.
ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన రాష్ట్రంలో సుమారు1500 మంది అక్రమ రవాణా నుండి విడిపించటం జరిగిందని(2014 నుంచి 2019) వరకు కానీ వీరిలో ఇద్దరు మాత్రమే బాధితుల నష్టపరిహారం పథకం క్రింద నష్టపరిహారం అందుకున్నారు, మరి మిగిలిన బాధితులకు పరిహారం అందలేదు అని శ్రీమతి పుష్ప ఆందోళన వ్యక్ఘం చేశారు.
క్రింద ప్రభుత్వం 2018లో అక్రమ రవాణా (నిరోధం, రక్షించడం మరియు పునరావాసం ) నిరోధక బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది . కానీ రాజ్యసభలో ఆమోదం పొందక పోవడం వల్ల ఆ బిల్లు రద్దు అయ్యింది . కనుక వెంటనే సమగ్రంగా అన్ని రకాల అక్రమ రవాణా నిరోధిస్తూ బిల్ ను ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టాలని విముక్తి డిమాండ్ చేస్తుంది అని అన్నారు.
ఆ బిల్లులో అక్రమ రవాణా బాధితులకు
1.కమ్యూనిటీ పునరావాసం కల్పించాలి కానీ షెల్టర్ హోమ్ లు వద్దు.
2.అక్రమ రవాణా బాధితులకు మానసిక ఆరోగ్య చికిత్సలు , సేవలు అందేలా చూడాలి.
3.అక్రమ రవాణా బాధితులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణలు అందించాలి.
4.అక్రమ రవాణా బాధితులు సమాజంలో వివక్షత,చిన్న చూపు,పునరావాసం బాధ్యతలు గ్రామపంచాయతీ నుండి జిల్లా స్థాయి అధికారులు బాధ్యత వహించాలి,అందులో విఫలం అయితే ఆ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి .
5. 100% ట్రాఫికర్స్ కు కఠిన శిక్షలు పడే విధంగా చూడాలి.
6. ఈ కేసులు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి.

కేంద్ర ప్రభుత్వానికి మా వినతి తో కూడిన డిమాండ్స్:
1. అన్ని రకాల అక్రమ రవాణాను నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం లేదా బిల్లు తీసుకొని రావాలి.
2. అన్ని రకాల అక్రమ రవాణాలను బిల్లులో లేదా కొత్త చట్టంలో చేర్చాలి.
3. అక్రమ రవాణ కేసుల దర్యాప్తులో అంతర్రాష్ట్ర సమన్వయం ఉండాలి.
4. రెస్క్యూ చేసిన తరువాత బాధితులను బలవంతంగా షెల్టర్ హోమ్ లకు పంపించ కూడదు.
5. కమ్యూనిటీ పునరావాసం మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించి బిల్లులో నిబంధనలు ఉండాలి. షెల్టర్ హోమ్ లో కౌన్సిలింగ్ ఉపయోగపడదు
6.15 రోజుల్లోనే మద్యంతర నష్టపరిహారం ఇవ్వాలి, బాధితులకు పూర్తి మరియు తక్షణ బాధితుల నష్ట పరిహారం అందించాలి.
7. అక్రమ రవాణా దారులకు ఒక సంవత్సరంలోపు వెంటనే శిక్ష పడాలి.
8. అక్రమ రవాణా దారులకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలి.
9. మైనర్ తో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రతి వారికి కఠినంగా శిక్షలు పడే విధంగా చూడాలి.
10. కోర్టులు (వేగవంతమైన విచారణ ద్వారా తీర్పు త్వరగా ఉండాలి మరియు అక్రమ రవాణా కేసుల్లో అప్పీలు చేయకూడదు).
11. బాధితులకు వ్యక్తిగతమైన, చట్టపరమైన ప్రాతినిధ్యం ఉండాలి.
12. అన్ని ఐ పి సి 370, 372, 373 లను అమలు చేయడానికి నిబంధన ఉండాలి నిబంధనలు అమలు చేయాలి.
13. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా ( వేధింపులు) జరిగితే ఆయా అధికారులకు శిక్ష విధించాలి.
14. ప్రత్యేక పునరావాస నిధి ఉండాలి.
15. బాధిత మహిళల పిల్లలకు సంస్థాగత /జిల్లా స్థాయి లో విద్యా సౌకర్యం కల్పించాలి.
16. శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కల్పించాలి.
17. రెస్క్యూ చేయబడిన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉపాధి విషయంలో సహాయం అందించాలి.
18. ఎం ఎం ఆర్ ఈ జి ఏ (MNREGA) కింద 200 రోజుల పని ఉండాలి.వేతనాలు సమయానికి అందించాలి.
19.బాధితులకు ప్రభుత్వ పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందించాలి.
20.ప్రభుత్వం షెడ్యూల్ చేసిన తేదీ మరియు సమయానికి సమాధానం ఇవ్వాలి. ఆర్టీఐ స్పందన , జవాబుదారీతనం కట్టుబడి ఉండాలి.
21. బాధితులకు పారిశుద్ధ్య హక్కు, విద్యా , సామాజిక హక్కులతో సహా వలస సేవలు అందించాలి.

2020 సంవత్సరం మానవత్వ చరిత్రలో సెక్స్ వర్కర్లకు ఒక చెత్త సంవత్సరంగా ఉండనియ్యండి . కానీ రానున్న 2021 సంవత్సరాన్ని అయినా “మానవత్వ హక్కుల సంవత్సరంగా ” చేద్దాం. విముక్తి సభ్యులుగా ….మేము మన సమాజానికి మరియు మన దేశానికి ప్రతిజ్ఞ చేస్తున్నాము ……”మానవత్వం కోసం చేసే పోరాటంలో , సెక్స్ వర్కర్లుగా మేము అన్ని చెడు, స్వార్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అందరితో కలిసి పనిచేస్తాము”..