మగవారి సెక్స్ సామర్థ్యానికి విరోధులు
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అది తెలుసుకోవటానికి ఆకలి నిద్ర, లైంగిక సామా ర్థ్యాలను అంచనా వేయటం ద్వారా తెలుసు కోవచ్చు. వీటిలో ఏ ఇబ్బంది లేకుండా బాగుంటే వారి ఆరోగ్యం ఇంకా చెడిపోనట్టే. దీని అర్థం మొత్తం బాగుందని కాదు. చెడి పోతూ ఉండవచ్చు.
లైంగిక సామర్థ్యం చెడిపోకుండా నాలుగు కాలాల పాటు ఉంచుకోవాలంటే దానికి శత్రువులుగా ఉండే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరిగే కొద్ది లైంగిక సామర్థ్యం ముందు కంటే కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ మన చేతిలో ఉన్న అంశా లలో అప్రమత్తంగా ఉంటే ముందు ముందు తలలు బోడులైనా తలపులు బోడులు కాకుండా చూసుకోవచ్చు.
బరువు : ప్రతి వారికి వారి వారసత్వ లక్షణాన్ని బట్టి, వారి ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఇది ఇతరత్రా కూడా ఆరోగ్యకరం. జీవన విధానాన్ని బట్టి కొంత అటూ ఇటూ ఉండవచ్చు కానీ అతిగా బరువు పెరిగి ఊబకాయం తెచ్చుకుంటే లైంగిక సామర్థ్యం పడిపోతుంది. పరిధి దాటి పెరిగే ప్రతి కేజీకి బరువుకి కొంత సెక్సు సామర్థ్యం తగ్గు తుంది. లడ్డుగా ఉన్న వారిలో నలబై దాటాక లేపన సమస్య వస్తే బరువు తగ్గటం మొదలు పెట్టాలి. తిండి మీద అదుపు,
ఒంటికి వ్యాయామం లేకుం డా మరి ఏ ఇతర పద్ధతిలో కూడా బరువు తగ్గటం సాధ్యంకాని పని.
కొలెస్టరాలు : సాధరాణంగా మన శరీరంలో ఉండాల్సినంత కొలెస్టరాలు ఉంటుంది. అయితే కొంత మందికి అవసరానికి మించి ఉంటుంది. కోలెస్టరాలులో మంచి కొలెస్టరాలు, చెడు కొలెస్ట రాలు అని రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట రాలు తగ్గే కొద్ది లైంగిక సామర్థ్యం తగ్గుతూ వుం టుంది. కాబట్టి ఎవరికైయినా అధిక కొలెస్టరాలు ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవటానికి జాగ్ర త్తలు తీసుకోవాలి. దీన్ని మందులు వాడి తగ్గించు కోవటం కంటే జీవన సరళిని మార్చు కోవటం ద్వారా తగ్గిం చుకోవటమే మంచి పద్ధతి. వీలుకానప్పుడు మాత్రమే మం దులు వాడుకోవాలి.
సోమరితనం : శరీరం కదలకుండా పనులు చేసే వారు లైంగికంగా బాగా ఉం డాలని ఆశించటం దురాశే అనుకోవాలి. హుషారుగా, చలాకీగా ఉన్న వారికి లైంగిక సామర్థ్యం బాగా ఉంటుంది. పైగా ఇలాంటి వారు కనీసం తిండిని అదుపులో ఉంచుకోక పోతే బరువు పెరగటం ఖాయం. పెరిగే బరువు మళ్ళీ సెక్సును తగ్గిస్తుంది.
పొగాకు వాడకం : పొగాకు ఏ రూపంలో వాడినా లేపన శక్తి దాదాపు 20 పాళ్ళు తగ్గు తుంది. అయితే ఇందులో ఓ గమ్మత్తు వుంది. వయసులో వున్నప్పుడు పొగకు వాడినా దాని వల్ల తగ్గిన లైంగిక సామర్థ్యం పెద్దగా పట్టింపుకు రాదు. కారణం ఏమి టంటే వయసులో వున్నప్పుడు మనలో అవస రానికి మించి చాలా నిలువ లైంగిక సామర్థ్యం ఉంటుం ది. ఏ కారణం వల్ల లేపన శక్తి తగ్గినా అదనంగా ఉన్న నిలువ శక్తి దాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి వయసులో ఉన్నప్పుడు పొగాకు వాడకం వల్ల తగ్గిన సామర్థ్యాన్ని గుర్తించలేరు. వయసు మీరే కొద్ది నిలువ శక్తితో పాటు ఉన్న సామర్థ్యం కూడా తగ్గి లేపన సమస్య వస్తుంది. దీనికి తోడు పొగాకు కూడా వాడితే లేపన శక్తి మరీ దారుణంగా పడిపోతుంది.
పొగాకు వాడే వారు తెలుసు కోవాల్సిన సత్యం ఏమిటంటే, లేపన సమస్య రానంత వరకూ పొగాకుతో ఎన్ని ఆటలు దాని ప్రభావం తెలియదు. కానీ ఒక సారి సమస్య వచ్చాక దాన్నుండి బయట పడాలంటే పొగాకు మానాల్సిందే. మానేసిన వారాని కల్లా దాని వల్ల తగ్గిన 20 పాళ్ళ లైంగిక సామర్థ్యం తిరిగి వస్తుంది.
ఆల్కహాలు : అప్పుడప్పుడూ మందు కొట్టే వారికి మందు వల్ల సెక్సుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అదే పనిగా తాగే వారి లో నరాలు చీకిపోయి చచ్చుగా తయార వుతాయి. దాంతో మెదడు నుండి కోరిక కరెంటును అంగానికి తీసుకు పోవటంలో తేడా వస్తుంది. నరాలు ఏ మేరకు చీకిపోతే ఆ మేరకు లేపుడు శక్తి తగ్గు తుంది.