
ఒంగోలు పట్టణంలో ప్రస్తుతం 1 వ సమ్మర్ స్టోరేజి చెరువు నందు 668ml, 2వ సమ్మర్ స్టోరేజి చెరువు నందు 1556ml అందుబాటులో ఉన్నాయి. రామతీర్థం రిజర్వాయర్ ద్వారా ప్రస్తుతం చెరువులకు మంచి నీరు వచ్చి చేరుతుంది. ఇంకా 20 రోజులు రామతీర్థం రిజర్వాయర్ నుండి మంచి నీరు వస్తే చెరువులు పూర్తి స్తాయిలో నిండుతాయి. 3 నెలలు 20 రోజుల పాటు వస్తాయి. ప్రస్తుతానికి ఉన్న నీళ్లు 2 నెలల పాటు వస్తాయని ఒంగోలు మున్సిపల్ ఇంజనీర్ దేవరపల్లి సుందర రామిరెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి గారి ఆదేశాలు మేరకు చెరువులను పూర్తి స్తాయిలో నింపుతాం. నగరంలో ప్రజలకు మంచి నీరు కష్టాలు రాకుండా చూస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.