संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

మంచినీళ్ల కోసం వచ్చి.. బంగారు గొలుసుతో పరార్‌

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మంచినీళ్ల కోసం వచ్చి.. బంగారు గొలుసుతో పరార్‌

खबर की मुख्य बातें

  • పామూరు: మంచినీళ్లు అడిగే నెపంతో ఇంట్లోకి వెళ్లి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించిన యువకుడిని పామూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
  • పామూరు శ్రీనివాస నగర్‌కు చెందిన సామాను గుర్రం నాగమ్మ (70) ఇంటి వద్దకు విరాట్ నగర్ కాలనీకి చెందిన కోనేటి విష్ణు (22) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లాడు.
  • మంచినీళ్లు కావాలని అడగడంతో నాగమ్మ నీళ్లు ఇచ్చింది.

పామూరు: మంచినీళ్లు అడిగే నెపంతో ఇంట్లోకి వెళ్లి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించిన యువకుడిని పామూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పామూరు శ్రీనివాస నగర్‌కు చెందిన సామాను గుర్రం నాగమ్మ (70) ఇంటి వద్దకు విరాట్ నగర్ కాలనీకి చెందిన కోనేటి విష్ణు (22) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లాడు. మంచినీళ్లు కావాలని అడగడంతో నాగమ్మ నీళ్లు ఇచ్చింది. ఆమె బాటిల్‌లో నీళ్లు పోస్తున్న సమయంలో మెడలో ఉన్న సుమారు 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కే. అనూక్ తన సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పామూరు–కందుకూరు రోడ్డు జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, నిందితుడిని కనిగిరి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *