संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जयशंकर भूपालपल्ली

భూసేకరణ పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భూసేకరణ పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలి

खबर की मुख्य बातें

  • భూపాలపల్లి, ఆగస్టు 25: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూసేకరణలో అర్హులైన భూ యజమానులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • ఈ సందర్భంగా భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులపై సమీక్షించారు.

భూపాలపల్లి, ఆగస్టు 25: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూసేకరణలో అర్హులైన భూ యజమానులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులపై సమీక్షించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని, ప్రతి కేసుకు టోకెన్ నంబర్ కేటాయించి పారదర్శకంగా పరిహారం చెల్లించాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది భూసేకరణ పరిహారం కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్లను విడుదల చేయనున్నందున అర్హత కలిగిన కేసులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతుల సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి ప్రాజెక్టు పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు.

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం, పునరావాస చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, భూసేకరణ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *