ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ഡോ. ബി.ആർ. അംബേദ്കർ കോനസീമ

భారీ వాహనాలతో బట్టేలంక–లక్కవరం రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
భారీ వాహనాలతో బట్టేలంక–లక్కవరం రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • Uploaded Video:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్టేలంక–లక్కవరం ప్రధాన రహదారిపై భారీ వాహనం నిలిచిపోవడంతో సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వాహనాలను ఈ మార్గంలోకి అనుమతించే సమయంలో రహదారి సామర్థ్యం, వాహనాల పరిమాణం తదితర అంశాలను అధికారులు ముందుగానే పరిశీలించాలని రాజోలు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా కోరారు. ONGC సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ, రహదారుల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని ఆయన ఆరోపించారు. రహదారులు మెరుగ్గా ఉండి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Uploaded Video:

భారీ వాహనాలతో బట్టేలంక–లక్కవరం రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *