కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా జనవరి 30న మన దేశంలో ప్రవేశించి ఈరోజుకి(27-6-20 ఉదయం 10గంటలకు) 5 లక్షల పది వేల మందికి సోకింది . రోజు రోజుకీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.
* మొదటి కేసు నమోదు అయినది జనవరి 30 .
* మే 18 నాటికి లక్ష కేసులు.
* జూన్ 6 నాటికి 18 రోజులలో లక్ష కేసులు 2 లక్షలు అయ్యాయి
* జూన్ 11నాటికి 5 రోజులలో 2లక్షల కేసులు 3 లక్షలయ్యాయి.
* జూన్ 20 నాటికి 9 రోజులలో ఈ 3లక్షలు 4 లక్షల కేసులు అయ్యాయి.
* జూన్ 26 నాటికి 7 రోజులలో 4లక్షల కేసులు 5లక్షలకు చేరాయి.
భవిష్యత్తులో సగం జనాభాకి సోకవచ్చనే అంచనాను ఊహించికోవడమే కష్టంగా వుంది. మందులు, వ్యాక్సిన్లు వచ్చేశాయని కరోనా నివారణ చర్యల్లో అలసత్వం చెయ్యవద్దు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సంవత్సరకాలం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
ధైర్యంగా ఉందాం!
నివారణ మార్గాలను ఆచరిద్దాం!! కరోనాను ఎదుర్కొందాం!!!