संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

బోగోలు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ జడ్పిటిసి పోలింగ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బోగోలు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ జడ్పిటిసి పోలింగ్

खबर की मुख्य बातें

  • వర్షంతో ఓటర్లకు స్వల్ప ఇబ్బందులు..
  • అధికారుల సమన్వయంతో సజావుగా ఎన్నికల ప్రక్రియ పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు: బోగోలు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
  • ఉదయం వేళ కురిసిన వర్షం కారణంగా పోలింగ్ ప్రారంభంలో ఓటర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వర్షంతో ఓటర్లకు స్వల్ప ఇబ్బందులు.. అధికారుల సమన్వయంతో సజావుగా ఎన్నికల ప్రక్రియ

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు: బోగోలు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం వేళ కురిసిన వర్షం కారణంగా పోలింగ్ ప్రారంభంలో ఓటర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ప్రభావంతో తొలుత పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ, అనంతరం వాతావరణం అనుకూలించడంతో ఓటింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి చేరుకుంది.

ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బోగోలు మండలం తుది పోలింగ్ గణాంకాలు:

వివరాలు| సంఖ్య
మొత్తం పోలింగ్ కేంద్రాలు| 63
మొత్తం ఓటర్లు| 39,342
పోలైన ఓట్లు| 25,607
పురుష ఓటర్లు| 12,367
మహిళా ఓటర్లు| 13,239
ఇతరులు| 1
పోలింగ్ శాతం| 65.09%

వర్షం కారణంగా ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులు మినహా, అధికారుల పర్యవేక్షణ, పోలీసుల సహకారంతో మండలవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *