संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపే మాధేయం, అంటున్న ఓగురు బ్రదర్స్!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపే మాధేయం, అంటున్న ఓగురు బ్రదర్స్!!!

खबर की मुख्य बातें

  • పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ )..
  • పామూరు మండల స్థాయిలో జరిగే జడ్పీటీసి ఎన్నికల్లో డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపే, ప్రధాన అంశంగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామని, స్థానిక 2వ ప్రాదేశిక చర్చగొష్టిలో ముక్తకంఠంతో పిలుపునిచ్చారు..ఓగురు బ్రదర్స్ లో ఒకరైన ఓగురు నరసింహారావు పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయం…
  • 2 వ ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలో ఓట్ బ్యాంకు మొత్తం మాకు, మా కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుందని తెలియచేసారు..

పామూరు, అక్టోబర్ 31(పున్నమి న్యూస్ రిపోర్టర్ ).. పామూరు మండల స్థాయిలో జరిగే జడ్పీటీసి ఎన్నికల్లో డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపే, ప్రధాన అంశంగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామని, స్థానిక 2వ ప్రాదేశిక చర్చగొష్టిలో ముక్తకంఠంతో పిలుపునిచ్చారు..ఓగురు బ్రదర్స్ లో ఒకరైన ఓగురు నరసింహారావు పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయం మాకు కొత్త కాదని, గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి, అన్ని వార్డులకంటే మేము పోటీ చేసిన వార్డుకు అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని పామూరు గ్రామ పంచాయతీలో తిరుగులేని బావుట ఎగుర వేసామని అన్నారు.. 2 వ ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలో ఓట్ బ్యాంకు మొత్తం మాకు, మా కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుందని తెలియచేసారు.. గడచిన స్థానిక ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2వ ప్రాదేశిక పరిధిలో, అన్ని ఎలక్షన్ బూత్ లలో మాకు అనుకూలంగా జరిగిందని గుర్తు చేశారు.. అదే విధంగా టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి ని గెలిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు..ఓటర్లను జాగృతం చేసే ఈ ఉడుతా భక్తి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవిటి సుబ్బయ్య,వాయినేని రాఘవేంద్ర,మాజీ పంచాయతీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ,టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు సాంబశివరావు పాల్గొన్నారు!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *