*బుర్రా కు కృతజ్ఞతలు తెలిపిన గెలిచిన జడ్పిటిసి,ఎంపీటీసీ అభ్యర్థులు*
కందుకూరు నియోజకవర్గంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన జడ్పిటిసి సభ్యులు మరియు ఎంపీటీసీ సభ్యులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు,కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవను కలిసి తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. జరిగిన ఎన్నికల్లో పోటీ చేయుటకు మాకు అవకాశం కల్పించి మా విజయానికి అన్ని విధాలుగా సహకరించిన బుర్రా మధుసూదన్ యాదవును ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటామని మాపై నమ్మకంతో అవకాశం కల్పించి విజయం చేకూర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. జగనన్న సంక్షేమ రాజ్యం తిరిగి తెచ్చుకునే దానికి బుర్రా.మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో నియోజకవర్గంలో బలంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.





