संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

బురహాన్‌పురం గ్రామంలో భూ రీసర్వేకు శ్రీకారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
బురహాన్‌పురం గ్రామంలో భూ రీసర్వేకు శ్రీకారం

खबर की मुख्य बातें

  • మరిపెడ, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్‌పురం గ్రామంలో గురువారం శ్రీకారం చుట్టారు.
  • రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర వివరాలను సేకరించి, భూ రికార్డులను మరింత పక్కాగా రూపొందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం భూ రీసర్వే ప్రక్రియను ప్రారంభించింది.
  • ఇందులో భాగంగా బురహాన్‌పురం గ్రామంలో అధికారులు సర్వే పనులను ప్రారంభించారు.

మరిపెడ, అక్టోబర్ 8: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్‌పురం గ్రామంలో గురువారం శ్రీకారం చుట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర వివరాలను సేకరించి, భూ రికార్డులను మరింత పక్కాగా రూపొందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం భూ రీసర్వే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా బురహాన్‌పురం గ్రామంలో అధికారులు సర్వే పనులను ప్రారంభించారు.

భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు, భూ యాజమాన్య వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డులను నమోదు చేయనున్నారు. రీసర్వే ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలు, హద్దుల వివాదాలు, విస్తీర్ణంలో తేడాలు వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది.

గ్రామంలోని భూ యజమానులు రీసర్వే ప్రక్రియకు అధికారులకు సహకరించి, తమ భూములకు సంబంధించిన పత్రాలు, వివరాలను అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. బురహాన్‌పురం గ్రామంలో ప్రారంభమైన ఈ భూ రీసర్వే కార్యక్రమంతో భూ యజమానుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భూ సర్వేల్లో భాగంగా మండల తహసిల్దార్ , మండల సర్వేయర్ గురువేష్ , గ్రామపంచాయతీ పాలనాధికారి రమేష్ ,లైసెన్స్ సర్వేయర్లు బుక్య రాము నాయక్ ,బాదావత్ శివ అలాగే గ్రామ సర్పంచ్, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *