संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

బుధరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బుధరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ఖానాపూర్, పున్నమి ప్రతినిధి : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. బుధరావుపేట వద్ద రాత్రి సమయంలో వెళ్తున్న ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తేజావత్ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
ప్రమాద ఘటనపై బుధరావుపేట ఎస్సై రామ్మోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బుధరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *