03-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర శివారులో హెచ్ పి గ్యాస్ గౌడౌన్ సమీపంలో ముంబయి రహదారిపై రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నెల్లూరు వైపు వెళ్తున్న లారీ(TN52H4519)మరియు సంగం వైపు వెళ్తున్న గూడ్స్ ఆటో(AP26TL3559)ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు కాగా, లారి ముందు వైపు స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించిన వారు రాకపోవడంతో షుమారు 45నిమిషాలపాటు వేచిచూసి, చివరకు అటుగా వెళ్తున్న విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి అతని ద్విచక్ర వాహనంపై ప్రదమ చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బుచ్చి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలను తెలుసుకొని, లారీని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.