బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…

0
161


ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది.

– ఏపీ తన సొంత జాగీరులా సీఎం వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నలభై వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు.

– ఏపీ ప్రభుత్వం పిచ్చిచర్యలని మానుకోవాలి. జీఎన్ రావు కమిటీ నివేదికని చెత్తబుట్టలో‌ పడేయాలి. వైసీపీలోనే వ్యతిరేఖత వస్తుంది. ఏపీ ముడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.

– బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంది. కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు.

– సెల్ఫ్ ఫైనాన్స్ తో అమరావతిని రాజధానిగా అభివృద్ది చేమోచ్చు.

– మడెం తిప్పమని, మాట తప్పవని చెప్పే జగన్ రాజధాని విషయంలో ఇచ్చిన మాటకి ఎందుకని కట్టుబడటం లేదు.

– ఏపీ అనేక సమస్యల్లో ఉంది. సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు. మీ నిర్ణయాలతో ప్రజలు నవ్వుకుంటున్నారు.

– అభివృద్ధి చెందిన వైజాగ్ ని మళ్లీ మీరు అభివృద్ధి చేసేదేమిటి?

– రాజధానిని మారిస్తే సహించేది లేదు. కేంద్ర పార్టీ‌ దృష్టికి తీసుకువెళ్లి ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం.

– ఏపీ ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. అంబానీ, అదానీ లాంటి వారంతా వెనక్కు వెళుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.

0
0