संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా జి. శ్రీనివాసులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా జి. శ్రీనివాసులు

భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మాకం సురేందర్ మక్తల్‌లో ప్రకటించారు. ఈ కమిటీలో కృష్ణ మండల మాజీ అధ్యక్షులు ఖాన్ దొడ్డి జి. శ్రీనివాసులుకు జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా కృష్ణ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్ హర్షం వ్యక్తం చేశారు. జి. శ్రీనివాసులుకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యత కల్పించిన జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు కృష్ణ మండలంలోని ఓబీసీలకు పార్టీకి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, ఓబీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా జి. శ్రీనివాసులు

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *