బాస్‌లతో సత్సంబంధాలు 2 వ భాగం

0
137

‌క్రితం వారం ఆర్టికల్‌ ‘‘ ‌మన పై అధికారులతో సత్సంబంధాలుకి కొనసాగింపు.
మన పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి అంటే, ఇంకా మనం ఏమేమి చేయాలో ఈ వారం చూద్దాం.
(1) మీ దైనందిన పని తాలూకు గోల్స్, ‌ధ్యేయాలు, మీ పై అధికారుల నమూనాతో సరిపోతాయో లేదో చెక్‌ ‌చేసుకుంటూ ఉం డండి. ఉదాహరణకి మార్కెట్‌లో కష్టమర్‌లు మీకు ఉన్న బాకీల వసూ
ళ్ళు మీ పై వారి వారాంతపు గోల్‌ అనుకోండి, మనం సేల్స్ ‌మీద ఫోకస్‌ ‌సారిస్తే, బండిని వారు ఒక వైపు, మీరు ఒక వైపు లాగుతున్నట్లు ఉంటుంది. వారం మొదట్లోనే, ఆ వారం మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో, మీ వీక్లీ ప్లాను, మీ పై అధికారి(ణి)కి చెబితే మంచిది. ఏమైనా మార్పులు కావాలి అంటే వారు సూచిస్తారు.
(2) మీ బాస్‌ ‌మీకు పని చెప్పినప్పుడు, పని ‘ఎప్పటి లోగ, ఏ విధంగా, ఏ నాణ్యతతో కావాలి అనేది ముందే నిర్ణయించుకుని , పని ఆ డేటులోగా పూర్తి చేయండి. ఒకవేళ అయ్యేలా లేక పోతే, మరో 2 రోజులు పట్టేలా ఉంటే అది 2 రోజుల ముందే మీ పై అధికారికి చెప్పేసెయ్యండి! వారు విసుక్కున్నా సరే! ఆ పని అనుకున్న తేదీ లోగా పూర్తి కావడానికి మరో ఇద్దరు మనుషులని కేటాయించడం అవసరం అనుకుంటే, వారు ఆ పని చేస్తారు! చివరి నిముషం దాకా ఆ విషయం మీ బాసు దగ్గర దాయకండి.
ఈ ‘వర్క్ ‌ఫ్రం హోం కల్చర్‌ ‌మొదలయ్యాక మన సహోద్యోగులతో కమ్యూనికేషన్‌, ‌క్రమం తప్పకుండా, దైనందికంగా ఉండడం చాలా అవసరం! ఎందుకంటే, కరోనా ముందరి జమానాలో లాగా వారు మన టేబిల్‌ ‌దగ్గరికి వచ్చి ‘ఏమోయ్‌! ఎం‌త దాకా వచ్చింది నేను చెప్పిన పని? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ‘అని అడగడం, కాఫీ / టీ బ్రేకు / లంచ్‌ ‌టైంలో పరామర్శించడం లాంటి అవకాశాలు ఇప్పుడు లేవు! కమ్యూనికేషన్‌ ‌తప్పనిసరి!
పని స్టేటస్‌ ‌తెలియ జేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకి మీ పై అధికారి, ఒక సోమవారం నాడు ‘శనివారం కల్లా పని అయి పోవాలి’ అని డెడ్‌ ‌లైను ఇచ్చి పని అప్పగించారు అనుకోండి.
అది ఆ తేదీ లోపు అవుతుందా లేదా, గురువారం సాయంత్రమే మీ పై అధికారికి తెలియ జేయండి. దీని వల్ల వారు ప్రత్యామ్నాయాలు ఆలోచించ గలరు, పనిలో పనిగా మీకునాలుగు అక్షింతలు వేసినా ! చెప్పిన దానిని బట్టి చెప్పనిది అర్ధం చేసుకుని పని చెయ్యండి. పై వారు నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన పూర్తి సమాచారం ఇవ్వండి ఇనీషియేటివ్‌ (‌చొరవ)కి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.మేము ఒక కంపెనీ సేల్స్ ‌మీటింగ్‌లో కూర్చున్నాం, కన్సల్టంటుగా టార్గెట్‌లు కావడం లేదు. అమ్మకాలు పెరగడం లేదు.
ఆ కంపెనీ హెడాఫీసు నుంచి వచ్చిన జనరల్‌ ‌మేనేజర్‌తో మొర పెట్టుకున్నారు సేల్స్ ఆఫీసర్‌లు. ‘మహాప్రభో! మా బైకులు అన్నీ తుప్పు పట్టి పోయాయి. రిపేర్‌లు వస్తున్నాయి. సర్వీసు బిల్లు మన వాళ్ళు పాస్‌ ‌చెయ్యడం లేదు. తిరగ లేక పోతున్నాము. జేబులో నుంచి డబ్బులు పెట్టుకుంటున్నాం!’’అని.
‘‘ ఇదేదో చూడవోయ్‌’’ అని వారి లాజిస్టిక్స్ ‌మేనేజర్‌తో అన్నాడు ఆ జి.ఎం. అని ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఈయన ఒక వారంలో మొత్తం ఆంధ్రా తెలంగాణాలో కంపెనీకి ఎన్ని బైకులు ఉన్నాయి, అవి కొన్న సంవత్సరం, తిరిగిన మైలేజి, ఇప్పటి పరిస్థితి, తుక్కు కండిషన్‌లో ఎన్ని ఉన్నాయి? కొత్తవి కొంటే ఎంత ఖర్చు అవుతుంది? కానీ, రిపేరు, మైలేజిల ఖర్చుల్లో ఎంత మిగల్చవచ్చు? వీటిని అమ్మి పారేస్తే ఎంత వస్తుంది? సేల్స్ ‌వుమెన్‌ ఎం‌తమంది? స్కూటీలు ఎంతమంది వాడుతున్నారు? ఎలక్ట్రికల్‌ ‌స్కూటర్‌లు కొంటే, నెలసరి పెట్రోలు ఖర్చు ఎంత మిగల్చవచ్చు?
ఇదంతా చెయ్యడం వల్ల సుమారుగా అమ్మకాలు, డబ్బుల కలెక్షన్‌లు కంపెనీకి ఎంత పెరగవచ్చు? మొత్తం మీద ఎంత లాభం? ఎంత నష్టం? ఎంత ఖర్చు? ఎలా మిగులు? ఈ మొత్తం వివరాలతో పూర్తి రిపోర్టు ఢిల్లీకి పంపాడు ఆ లాజిస్టిక్స్ ‌మేనేజరు!
జనరల్‌ ‌మేనేజరు పని సులభం అయింది ! యాజమాన్యం దగ్గర ఈ రిపోర్టు పెట్టి ‘‘అయ్యా ! ఇవీ వివరాలు ! ఇక మీ కంపెనీ, మీ ఇష్టం!’’ అని వచ్చేశాడు. వారం రోజుల్లో, దాదాపు 40 శాతం ‘తుక్కు’ బైకులు అమ్మేసి కొత్తవి కొన్నారు. అసలే పెట్రోలు 130 రూపాయలు అవచ్చని అంచనా! ఇప్పుడు కాదు, వచ్చే 5 సంవత్సరాలలో కంపెనీకి ఎంత ఆదా అవుతుందని లెక్క కట్టారు. కొత్త బైకు పొందిన ప్రతి సేల్స్ ఆఫీసరూ, ఆ లాజిస్టిక్స్ ‌మేనేజరుకి మిఠాయి తినిపించారు!
స్థూలంగా చెప్పేది ఏమిటంటే, మన పై అధికారులకి, మన సమస్య గురించి పూర్తి వివరాలు అందించి ‘లాభం, నష్టం ‘భాషలో మాట్లాడితే, వారు త్వరగా సరియైన నిర్ణయాలు తీసుకోగలరు. బాసులతో సత్సంబంధాలకి ఇదో మార్గం !

0
0