संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

బండి ఆత్మకూరు:బండి ఆత్మకూరు కేజీబీవీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బండి ఆత్మకూరు:బండి ఆత్మకూరు కేజీబీవీ పాఠశాలలో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

खबर की मुख्य बातें

  • కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) ఆవరణలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
  • విద్యార్థినులలో మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం, పరీక్షల ఒత్తిడిని అధిగమించడం మరియు భావోద్వేగ సమతుల్యతపై మార్గదర్శనం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.
  • ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ భవాని అధ్యక్షత వహించగా, ముఖ్య వక్తగా ప్రముఖ మానసిక ఆరోగ్య కౌన్సిలర్ జి.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) ఆవరణలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులలో మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం, పరీక్షల ఒత్తిడిని అధిగమించడం మరియు భావోద్వేగ సమతుల్యతపై మార్గదర్శనం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ భవాని అధ్యక్షత వహించగా, ముఖ్య వక్తగా ప్రముఖ మానసిక ఆరోగ్య కౌన్సిలర్ జి. రంగనాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జి. రంగనాయకులు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. చదువుల ఒత్తిడి, ఆందోళన లేదా ఇతర సమస్యలను మనసులోనే దాచుకోకుండా, ఉపాధ్యాయులు లేదా నిపుణులతో పంచుకోవాలని సూచించారు. నిత్యం ధ్యానం, శారీరక వ్యాయామం, సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని, మానసిక సమస్యలపై అవగాహన కలిగి ఉండటం బలహీనత కాదని, అది వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు.అనంతరం ప్రిన్సిపాల్ భవాని మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు సుమలత, అనూరాధ, పాల్గొని సమయపాలన, ఒత్తిడి నివారణ మార్గాలపై విద్యార్థినులకు సూచనలు చేశారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *