ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ల యుగం నడుస్తోంది. అదే ఇప్పుడు సరికొత్త జబ్బులకు కారణమవుతోంది. చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఉండలేకపోవడాన్నే నో మొబైల్
ఫోన్ ఫోబియా అని వైద్యులు చెబుతున్నారు. యువకులు, ఉద్యోగులు, బిజినెస్ పర్సన్స్ లో ఈసమస్య అధికంగా ఉన్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. మొన్నటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ సమస్య మనదేశంలోనూ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రేమ జంటలపై ప్రభావం చూపుతోంది. నో మొబైల్ ఫోన్ ఫోబియా అంశం ఐదేళ్ల క్రితమే గుర్తించారు. గతంతో పోలిస్తే.. ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో 66 శాతం మంది ఇప్పుడు నోమో ఫోబియా బారినపడుతున్నారు. నోమో ఫోబియా ఉన్నవారు ఫోన్ ను ఒక్కసారి కూడా స్విచ్ఛాఫ్ చేయరట. బాత్ రూమ్‌కి వెళ్లిన ఫోన్‌ను వదలరట. ఫోన్ రింగ్ కాకపోయిన అయినట్టు భ్రమపడతారట. సాధారణ వినియోగదారుల కంటే కొందరు మొబైల్‌ఫోన్‌కు దూరమై బతకలేమంటున్నారు.. కొందరు ఫోన్ దూరమైతే తీవ్ర డిప్రెషన్లోకి వెళతామంటున్నారు. మానసిక సమస్యల జాబితాలో ఈ సమస్యను కూడా చేర్చాలా వద్దా అన్నదానిపై చర్చ మొదలైంది. మొబైల్ వినియోగదారుల్లో నోమో ఫోబియా ఉందో లేదో తెలుసుకునేందుకు అమెరికాలో పూర్తిస్థాయి పరిశోధకులు కూడా మొదలయ్యాయి.
ఈ సందర్భంగా కొంత మంది మేధావులు ఫోను వాడడం తప్పు అని మాత్రం అనడం లేదు. ఏ మేరకు ఉపయోగించాలో ఉపయోగించుకుంటూ కనీసం రాత్రి పడుకునేటప్పుడు ఒక మంచి పుస్తకాన్ని చదవడం, చదివిన విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి భోజన సమయంలో చర్చించుకోవడం, మిత్రులు కలిసినప్పుడు పై విషయాలను చర్చించడం, తను పాటించడం మంచిదని సలహా ఇస్తున్నారు.