అనంతసాగరం మండలం చిలకమర్రి గ్రామ సమీపంలో సోమశిల ఉత్తర కాలువ వద్ద మృత్యువాత పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సోమశిల ఎస్ఐ సి వి సుబ్బారావు గారి కథనం సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్దామని వచ్చిన వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కు చెందిన కంబాల రవిశంకర్ (42) వైఎస్ఆర్ జిల్లా గోపవరం లో ఎం ఈ ఓ కార్యాలయం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవు రోజు కావడంతో సరదాగా స్నేహితులు విష్ణు, వినోద్ కలిసి చిలకమర్రి సమీపంలో ఉన్న ఉత్తర కాలువలో ఈతకు దిగాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో రవిశంకర్ , విష్ణు వినోద్ లు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతికష్టం మీద వారిని వెలుపలికి తీశారు. వారిని వెలుపలికి తీసే లోపే అపస్మారక స్థితికి చేరుకున్నారు. రవిశంకర్ అప్పటికే మృత్యువాత పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇరువురిని ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.