खबर की मुख्य बातें
- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, నంద్యాల నగరంలో ఉన్నటువంటి పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సెలవు దినాల్లో అనధికాంగా తరగతి గదులను నిర్వహిస్తున్న యాజమాన్యాల దగ్గరికి వెళ్లి తరగతి గదులు జరగకుండా అడ్డుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లక్ష్మి నరసింహ…
- ఆదివారం రోజున జరుగుతున్న తరగతి గదులను అడ్డుకొని, సాక్షాధారాలతో సహా తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలను అడ్డుకోవడం జరిగింది.
- ఇవే కాకుండా నంద్యాలలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అనధికాంగా తరగతి గదులు నిర్వహిస్తున్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, నంద్యాల నగరంలో ఉన్నటువంటి పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సెలవు దినాల్లో అనధికాంగా తరగతి గదులను నిర్వహిస్తున్న యాజమాన్యాల దగ్గరికి వెళ్లి తరగతి గదులు జరగకుండా అడ్డుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లక్ష్మి నరసింహ మాట్లాడుతూ, నగరంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలో అనధికారికంగా, ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతి గదులను, స్పెషల్ క్లాస్ ల పేరుతో నిర్వహిస్తున్నారని, కలెక్టర్ ఆఫీస్, విద్యాశాఖ అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లిన కనీసం చలనం కూడా లేదని చెప్పారు.
ఆదివారం రోజున జరుగుతున్న తరగతి గదులను అడ్డుకొని, సాక్షాధారాలతో సహా తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలను అడ్డుకోవడం జరిగింది. ఇవే కాకుండా నంద్యాలలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అనధికాంగా తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఎందుకు తరగతి గదులు నిర్వహిస్తున్నారు అని అడిగితే, మేము విద్యాశాఖ అధికారులతో మాట్లాడుకుంటాము, మీరెవరు మమ్మల్ని అడగడానికి అని చెబుతున్నారు. దీనికి విద్యాశాఖ స్పందించాలని ఏబీవీపీ నంద్యాల శాఖ డిమాండ్ చేస్తుంది. మీ సంగతి ఏంటో చూస్తాం, ఏంటి మీ పంచాయతీ అనే వలగరి మాటలతో పాఠశాల యంత్రాంగాలు వ్యవహరిస్తున్నాయి.
ఇలాంటి పాఠశాల యాజమాన్యాలను గుర్తించి, నోటీసులు జారీ చేయాలని లేదా సీజ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో నంద్యాల భాగ్ కన్వీనర్ మనేష్ నాయుడు, నగర జాయింట్ సెక్రటరీలు సాయి, చైతన్య, SFD కన్వీనర్ కేదార్, విష్ణు, వెంకటేష్ పలువురు పాల్గొన్నారు.