संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

* *ఓటరు గుర్తింపు కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలి*

* *ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి*

*..జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ**

*రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.*

నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. నవంబర్ 1వ తేదీన ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఓటరు జాబితాలో పేరున్నవారు ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

*గుర్తింపు కోసం అనుమతించిన 12 రకాల కార్డులు:*
ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, పోస్టాఫీసు పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం వేతన జాబ్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్), స్మార్ట్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, వికలాంగుల గుర్తింపు కార్డు.

ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకోండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *