రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూప చారి విలేకరుల్ల తో మాట్లాడుతూ జీవో నెంబర్ 43 రద్దుచేసి పీజీ మెడికల్ సీట్ల లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థుల పక్షాన నిరంతరం కృషి చేసే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు,గతంలో 2013వ సంవత్సరంలో ఉన్న అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 43 పెట్టి పీజీ మెడికల్ సీట్లలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేకూర్చింది .
కాని ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకొని జీవో నెంబర్ 43 పై విచారణ జరిపి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన విద్యార్థినీ విద్యార్థులకు న్యాయం చేకూర్చే విధంగా జీవో నెంబర్ 43 రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థులకు అండగా కొత్త జీవో నెంబర్ 52 తీసుకొచ్చి వారి జీవితాలలో బంగారుబాటలకు అడుగులు వేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంటుంది అని మరోసారి నిరూపించారు అలాగే బడుగు బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వైయస్సార్ విద్యార్థి విభాగం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థినీ విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు…