Saturday, 26 September 2026
  • Home  
  • పోషకాహారంతోనే చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదల
- తిరుపతి

పోషకాహారంతోనే చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదల

– కేకే వడ్డీపల్లిలో సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలు – తల్లులకు పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన చిట్వేల్: చిట్వేల్ మండలం చిట్వేల్-2 సెక్టార్ పరిధిలోని కేకే వడ్డీపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ ఉత్సవం, పోషణ్ మాసం కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సురేఖరాణి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చాలని తల్లులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

– కేకే వడ్డీపల్లిలో సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలు

– తల్లులకు పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన

చిట్వేల్: చిట్వేల్ మండలం చిట్వేల్-2 సెక్టార్ పరిధిలోని కేకే వడ్డీపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం సేవా సంకల్ప అభియాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ ఉత్సవం, పోషణ్ మాసం కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సురేఖరాణి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తప్పనిసరిగా చేర్చాలని తల్లులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.