పలమనేరు, జులై8,2020( పున్నమి విలేఖరి): పేద ప్రజల గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. వైఎస్ 71 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వైయస్ రాజశేఖర్రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ..పేదల గుండెల్లో గూడుకట్టుకున్న మహానుభావుడు అని కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం రైతు దినోత్సవంగా గా పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న నూతన పథకాలు రైతాంగానికి చేయూతనిస్తున్నారు. కరోనా కష్టాల కాలం లో ఆర్థిక ఇక్కట్లు ఎన్ని ఉన్నా ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దక్కిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల ఆదుకున్న గొప్ప నేతగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, వైసిపి పట్టణ కన్వీనర్ మండి సుధా,బాలాజీ నాయుడు,ఫయాజ్,జాఫర్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.