ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ശ്രീ പൊട്ടി ശ്രീരാമുലു നെല്ലൂർ

*పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు* *డ్రెయిన్లు, కాంపాక్టర్ల వద్ద చెత్త నిల్వ ఉండకూడదు* *శానిటేషన్‌ సిబ్బందితో సమీక్షలో కమిషనర్‌ ఎన్‌.వి.వి. సత్యనారాయణ*

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
*పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు* *డ్రెయిన్లు, కాంపాక్టర్ల వద్ద చెత్త నిల్వ ఉండకూడదు* *శానిటేషన్‌ సిబ్బందితో సమీక్షలో కమిషనర్‌ ఎన్‌.వి.వి. సత్యనారాయణ*

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌.వి.వి.
  • సత్యనారాయణ ఆదేశించారు.
  • నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఉదయం శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డ్రెయిన్ల శుభ్రత, నిల్వ నీటి నివారణ, ఇంటింటి చెత్త సేకరణ, కాంపాక్టర్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్):
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌.వి.వి. సత్యనారాయణ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఉదయం శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డ్రెయిన్ల శుభ్రత, నిల్వ నీటి నివారణ, ఇంటింటి చెత్త సేకరణ, కాంపాక్టర్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు.
స్థానిక కమ్యూనిటీ నాయకులతో సమన్వయం చేసుకుని వారి పరిధిలోని సమస్యాత్మక, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి శానిటేషన్‌ సెక్రటరీ తమ పరిధిలోని డ్రెయిన్లను స్వయంగా పరిశీలించి, దగ్గరుండి శుభ్రం చేయించాలని, పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

నిల్వ నీటిపై తక్షణ చర్యలు

ఎక్కడైనా నీరు నిలిచే పరిస్థితి ఉంటే వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ స్పష్టం చేశారు.అవసరమైన చోట్ల జెట్టింగ్‌ యంత్రాలను వినియోగించి డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలు, మురుగునీటిని తొలగించాలని సూచించారు.నీరు ముందుకు వెళ్లేందుకు మార్గం లేని ప్రాంతాల్లో తాత్కాలికంగా కచ్చా డ్రెయిన్లు ఏర్పాటు చేసి నిల్వ నీటిని మళ్లించాలని ఆదేశించారు.దోమల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్‌ నిర్వహించాలన్నారు.
కాంపాక్టర్ల వద్ద చెత్త ఉండకూడదు
స్వయంభూ వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు.కాంపాక్టర్ల వద్ద ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.కాంపాక్టర్ల వద్ద చెత్త నిల్వ ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత శానిటేషన్‌ సెక్రటరీనే బాధ్యుడిని చేస్తామని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం పర్యటిస్తూ ప్రజలకు ఎదురవుతున్న పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని కమిషనర్‌ సూచించారు. ప్రతి శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌,సెక్రటరీ తమ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు.సమావేశంలో సూపర్టెండెంట్ రామశాస్త్రి, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు,శానిటేషన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *