వృత్తి జీవితం – 5
ఇంకొకరితో పోలికలు వద్దు !
మిమ్మల్ని మీరుగా అంగీకరించండి . మీలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలూ
ఉండవచ్చు . ఇతరులలో కూడా అవి ఉంటాయి కానీ, వేరు వేరు రకాల ప్లస్‌లు మైనస్‌లు ! గుర్తు ఉంచుకోండి. పని అనేది మన జీవి తంలో ఒక భాగం మాత్రమే ! దీనికి మించిన సంపూర్ణ వ్యక్తిత్వం మన అందరికీ ఉంటుంది!
కానీ దురదష్టవశాత్తు మనలో చాలా మందిమి, మనం పనిలో సాధించే విజయాన్ని బట్టే, మన ఆత్మ గౌరవం పెంచుకోవడం, లేదా తగ్గించు కోవడం – చేస్తూ ఉంటాము.
చాలా మంది , తమ ఐడెంటిటీ, ఉనికి , మనకి మనం ఇచ్చుకునే విలువ, అన్నీ –
వత్తికే ముడి పెట్టుకుంటారు . ఒక ఇంకిమెంటు కో, ప్రమోషన్‌కో, లేక విదేశీ ట్రిప్పుకో, లేక ఆన్ సైట్ ప్రాజక్టుకో. ప్రమోషన్ కానీ, మిగతావి కానీ, మన పక్క సహోద్యోగికి వచ్చి మనకి రాక పోతే, ఆ ఉద్యోగి బాధ వర్ణనాతీతం ! మనో వ్యాధి పట్టేస్తుంది.
ఒక పెద్ద సంస్థలో అన్నీ కరెక్ట్‌గా , న్యాయంగా జరగవు. కొన్ని అన్యాయాలు ఉం టాయి, పాలిటిక్స్ ఉంటాయి. ఒక్కోసారి ఆ అన్యాయానికి, పాలిటిక్స్‌కి మనం బలి అవుతాము.
అయినా, వత్తి జీవితం ఒక్కటే మన వ్యక్తిత్వానికీ, మన విలువలకు గీటురాయి కాదు! మనకి ప్రమోషన్ / ఇంక్రెమెంటు / ఆన్ సైట్ ప్రాజక్టు, అవార్డు, రివార్డు వచ్చినా రాక పోయినా – ఇంటికి వస్తే ఆప్యాయంగా చూసుకునే జీవిత భాగస్వామి , పిల్లలు, లేక మిమ్మల్ని చూడగానే తోక ఆడించే పెంపుడు కుక్క – ఉంటే , మీరు విజయం సాధించినట్లే!
కాబట్టి , మనకి మనం ఇచ్చుకునే విలువ ( సెల్ఫ్ వర్థ్ ) మొత్తం వత్తి కే ముడి పెట్ట వద్దు ! ఇది మానసిక ఆరోగ్యానికి మేము చేసే మరొక సూచన .
10. మరి మన సహోద్యోగుల మానసిక ఆరోగ్యం మాట ఏమిటి ?
ఇప్పటి దాకా మనం – పని చేసే చోట మన మానసిక ఆరోగ్యం కోసం ( మందులు వాడకుండా ) మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో – తెలుసుకున్నాం .
ఇప్పుడు మనం, ఇతరుల, అనగా మన సహోద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం మనం ఏమైనా చేయగలమో లేదో – చూద్దాం. ఇది ముఖ్యం! ఎందుకంటే, మనం మన తోటి వారికి ఏమి ఇస్తామో, అదే మనకు ఏదో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది . మనం వారి శ్రేయస్సు గురించి శ్రద్ధ తీసుకుంటే, మన టైం బాగు లేనప్పుడు, మనము ‘ డౌన్’లో ఉన్నపుడు మనకి ఆసరా / సహాయం లభిస్తాయి. మనం పరస్పర ఆధారిత సామాజిక వ్యవస్థలో నివసిస్తున్నాము కాబట్టి.
మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం ఎంత అవసరమో, ఇతరుల గురించి శ్రద్ధ చూపించడం కూడా అంతే ముఖ్యం. ఇత రులూ మనమూ ఒకటే అనుకున్నప్పుడు.
మనమందరం, కుటుంబ వ్యవస్థ నుంచి తయారయిన మనుషులం. మీ సహోద్యోగు లలో కుటుంబ సమస్యల వల్ల ఆఫీసులో డిప్రెష న్‌కి లోను అవుతున్నారేమో – కనుక్కోండి. మీకు క్లోజ్ గా ఉన్న కొలీగ్స్‌తో. వారి ఇంట్లో వద్ధులైన తల్లిదరండ్రులు ఉన్నారా ? వారిని ఇంట్లో వదిలి పనికి రావాల్సి వస్తోందా ? మీకు తెలిసిన ‘ డే కేర్’ ఇచ్చే వారు ఉంటే, మగ నర్సులు, డే కేర్ సెంటర్‌లు, మీకు తెలిస్తే, సూచించండి.
వారి పిల్లలు చదువులో ఎక్కి రావటం లేదని వర్రీ అవుతున్నారా? మీకు తెలిసిన మంచి ట్యూటర్ ఉంటే, వారికి తెలియ జేయండి.
మీ సహోద్యోగి పని వత్తిడిని సరిగా హ్యాండిల్ చెయ్య లేక మీ బాస్‌చేత బాగా తిట్లు తింటున్నారా ? మీరు కాస్త ట్రెయినింగ్/ కోచింగ్ ఇచ్చి వారి నైపుణ్యం మెరుగు పరచ గలరేమో ఆలొచించండి . పని నేర్పిన వారి పట్ల చాలా మంది జీవితాంతం క్రుతగ్నులుగా ఉంటారు .
మీకు ఏయే సబ్జక్ట్‌ల పట్ల మంచి పరిజ్ఞానం ఉంది? మీ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి రెండు క్లాసులు చెప్ప గలరేమొ చూడండి! మీ ఆఫీసుకి బయట , ఏవైనా సామాజిక సేవా కార్య క్రమాలలో ‘ వాలంటీర్ / స్వచ్చంద సేవకులుగా చేరండి. దీర్ఘ కాలం వ్యాధితో బాధ పడుతూ మంచం పట్టిన చుట్టాలు ఎవరైనా ఉంటే, వారిని, తీరిక చేసు కుని అప్పుడప్పుడూ సందర్శించండి .
ఇంటర్ / డిగ్రీ చదివిన విద్యార్ధినీ విద్యా ర్ధులకి పోటీ పరీక్షలలో ‘ ఫ్రీ కోచింగ్ ‘ ఇవ్వండి. ఒకటి రెండు క్లాసులు. మీకు బాగా కమాండ్ ఉన్న సబ్జెక్టులలో.
కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉం డండి. డాక్టర్ లకీ జబ్బులు వస్తాయి. మానసిక వ్యాధి నిపుణులు కూడా డిప్రెషన్‌కి లోను అవు తారు. క్రీడాకారులకి కూడా గాయాలు అవుతాయి. ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే క్రమంలో, వారి సమస్యలను మీరు ఎక్కువ సీరియస్ గా తీసుకుని, మీరు మానసిక వత్తిడికి గురి కావద్దు.
మీ ప్రతి స్పందన తెలియజేయ వలసిన ఇ- మెయిల్ : : essence.training@ yahoo.com, punnami.news @ gmail. com.