పంచాయితీరాజ్ ఇంజనీర్ల సహాయనిరాకరణ..

0
138

తూర్పుగోదావరిజిల్లా, అమలాపురం :
అమలాపురం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ డివిజన్ ఆవరణలో పి.ఆర్ ఇంజినీర్లు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు.ఎన్.ఆర్.జి. ఈ.ఎస్ సీసి రోడ్ల పనులపై పలుమార్లు తనిఖీలు చేపట్టడం ప్రభుత్వానికి తగదని రాష్ట్ర పి.ఆర్. జేఏసీ పిలుపు మేరకు సోమవారం పంచాయతీ రాజ్ కార్యాలయంలో డివిజన్ నలుమూల ల నుండి ఇంజినీర్లు హాజరయ్యి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా జే ఏ సి కన్వీనర్. అన్యం. రాంబాబు , కో ఆర్డినేటర్ డి ఈ లు వి.చంద్రశేఖర్ , కె.రమకాంత్, జే. మురళి కృష్ణ , ఏ.ఈలు వి.రాధా కృష్ణ ,జి. సత్యనారాయణ, డి.యస్.ఎల్. సంధ్య, హెచ్. డి. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల కాలం లో గ్రామాల్లో లో వేసిన సి సీ.రోడ్లను అనేక పర్యాయాలు తనిఖీలు చేపట్టడం వల్ల ఇంజినీర్లు మానసిక వేదనకు గురి అవుతున్నారని తెలిపారు.గ్రామీణ భారతం అభివృద్ధిలో కీలక పాత్రవహిస్తున్న ఇంజనీర్ల కు ఇటువంటివి చర్యలు అవమానకరం గా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే 9 క్యూ.సి టీమ్స్ జిల్లా స్థాయిలో 1100 పనులను విచారణ చేస్తుండగా,మధ్యలో మళ్ళీ విజిలెన్స్ టీమ్స్ ను కూడా తనిఖీ చేయమని మౌఖికం గా ప్రభుత్వం ఆదేశించడం శోచనీయమన్నారు.నాడు ఇంజినీర్లు రేయింబవళ్లు కష్ట పడి సి సీ రోడ్లు నిర్మాణం చేపట్టడం వల్ల,కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలకు,కలెక్టర్లకు కు అవార్డులు రావడం జరిగిందని తెలిపారు.వెంటనే సదరు తనిఖీలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.