పొదిలి పట్టణంలో పెన్ పవర్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీ కార్మికులకు నిర్వహించే భోజనాలకు జబర్దస్త్ ఫేమ్ నెమలి రాజు ఆర్ధిక సహాయం అందజేశారు. అందులో భాగంగా 61 వ రోజు ఆయిన సోమవారం స్వయంగా వచ్చి వడ్డించారు. సాధారణ భోజనంతో పాటు స్పెషల్ లడ్డు, బూందీ, అరటిపండు, అప్పడం స్వయంగా వచ్చి వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరులు , స్నేహితులు పాల్గొన్నారు.