నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

0
28

నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
స్వాతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పీఆర్‌టీయూ (PRTU) కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

జాతీయ మహోన్నత నాయకుడిగా, రాజ్యాంగ రూపకర్తగా, సమాజ శ్రేయస్సుకు పాటుపడ్డ మహనీయునిగా అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సర్వశిక్షా అభియాన్ AMO శ్రీ సుదీర్‌బాబు హాజరై, అంబేద్కర్ చూపిన మార్గం ఇప్పటికీ సమాజానికి దిశానిర్దేశకమని అన్నారు. ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా PRTU ప్రధాన కార్యదర్శి నాటకం తిరుమలయ్య, ఉపాధ్యాయులు వెంకటరాజు, నాగేంద్రకుమార్, సురేష్, రంగారావు, భాస్కర్, సైమన్ కుమార్, నాగిరెడ్డి, ఆచారి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను అనుసరించి విద్యారంగం పటిష్టంగా ఉండాలనే సంకల్పంతో తమ పోరాటం కొనసాగిస్తామని నాటకం తిరుమలయ్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here