దర్శి, జూన్ 5, 2020(పున్నమి విలేఖరి): దర్శి మున్సిపాలిటీ పరిధిలో వ్యాపార సంస్థలు, కొనుగోలు, అమ్మకం దారులు కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శుక్రవారం మున్సిపల్ అధికారి ఆవుల సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వద్ద ఐదు మంది కంటే ఎక్కువగా ఉండరాదని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానీటైజర్ లు వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన అన్నారు. మాస్క్ ధరించని వారికి 50 రూపాయల జరిమానా, వ్యాపార సంస్థల వారు నిబంధనలు ఉల్లంఘించి నట్లయితే 500 రూపాయలు జరిమానా తదితర అంశాలను మున్సిపల్ కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించుచున్నట్లు తెలియజేశారు.