నిండు జీవితానికి రెండు చుక్కలు*

0
164

ఆలమూరు జనవరి 31 (పున్నమి విలేఖరి): పోలియో మహమ్మారిని పార దోలేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్ల, చొప్పెల్ల పీహెచ్సీ వైద్యులు ఆర్ సుదర్శన్ బాబు, ఎం సుమలత పేర్కొన్నారు. ఆలమూరు మండలం గ్రామ పంచాయతీల పరిధిలో చిన్నారులకు పోలియో చుక్కల కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చుక్కలు వేయిస్తే పోలియో మహమ్మారి దరి చేరదని, ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తుంది. ప్రభుత్వం వేసే పోలియో చుక్కలే కాకుండా తల్లిదండ్రులు తమ వీలును బట్టి పోలియో చుక్కలు సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వేయించాలన్నారు. దగ్గు, జ్వరం, జలుబు, విరేచనాలు, ఏ ఇతర జబ్బులు వచ్చినా పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని తెలియజేశారు. 19వ శతాబ్దంలో మొదటి సారిగా పోలియో వ్యాధిన పడ్డ చిన్నారులను వైద్యులు గుర్తించి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందనారు. ఈ వ్యాధి సొకితే చిన్నారుల కాళ్లు, చేతులపై ప్రభావం చూపి అవి పనిచేయకుండా పోతాయని, ఈ వ్యాధి వైరస్‌ టైప్‌-1, టైప్‌-2, టైప్‌-3 వల్ల వస్తుంది. ఈ వైరస్‌ చిన్నారుల శరీరంలో ఉండి పోలియో వ్యాధి రావడానికి కారణమవుతుందని, పోలియో చుక్కలు సంవత్సరంలో రెండు సార్లు వేయించాలని. ఈ చుక్కలు పోలియో వైరస్‌ మీద సైనికుల్లా పోరాటం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.