నాయకులు, కార్యకర్తలతో నేడు కాకాని సమావేశం
వెంకటాచలం జనవరి 30 పున్నమి విలేకరి
సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆదివారం వెంకటాచలం రానున్నారు. మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా నేడు జరిగే ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకోనుంది.