కడప అన్నమయ్య జిల్లాలలో ఉపాధ్యాయ ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ వారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం మండలంలోని ఆడపూరు నందు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగ పరిరక్షణకు, విద్యార్థుల నమోదు పెంచుటకు, , పేద విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి గుర్తింపు గా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ వారు పట్టుశాలువా, మెడల్, జ్ఞాపిక తో ఘనంగా సత్కరించి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సర్టిఫికేట్ ను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ రుక్సానా హస్సన్ , డాక్టర్ సమతానాయుడు , ఆడపూరు బాలికల గురుకల పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అలానే , హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కడప అన్నమయ్య జిల్లా చైర్మన్ డాక్టర్ వి డేవిడ్ కళ్యాణ్ రాజ్,నందలూరు రైల్వే కన్సిల్టేటివ్ మెంబర్ మురళీధర్, వీర బల్లి జయ కుమార్ రెడ్డి, నందలూరు సోషల్ మీడియా అధినేత మెహర్ ఖాన్, నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగనపల్లె వెంకటరమణ, ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి, నరసింహారావు, కృపానందం, విశ్రాంత ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.








